నటిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గత రెండు మూడేళ్లుగా మాత్రం పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తూ ఉన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టర్కీలో జరిగిన ఏసియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు మెడల్స్ సాధించడం విశేషం.
2023 నుండి ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రగతి గత రెండేళ్లలో పలు పతకాలు సాధించారు. ఇప్పుడు ఏసియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారంతో పాటు వెండి పతకాలు గెల్చుకున్నారు. టర్కీలో జరిగిన పోటీల అనంతరం ఓవరాల్‌గా వెండి పతకం గెల్చుకున్నానని, డెడ్ లిఫ్ట్ విభాగంలో బంగారు పతకం, బెంచ్, స్క్వాడ్ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించానని తెలిపారు.