నటి పూర్ణ అలియాస్ షామ్నా ఖాసిమ్ రెండోసారి తల్లి అయ్యారు. ఈ ఉదయం 4.25 గంటలకు ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. తన జీవితంలోకి వచ్చిన ఈ చిన్నారి అపురూపమైన కానుక అని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ సాఫీగా జరిగినందుకు దేవుడికి, ఆసుపత్రి సిబ్బందికి పూర్ణ తన కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణకు 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం జరిగింది. వీరికి 2023లో బాబు హమ్దాన్ జన్మించాడు. ఇప్పుడు మరోసారి తల్లి అయ్యారు.