ముంబై నగరంలోని జుహూలో నిర్భయ స్క్వాడ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌పై తాగి వాహనం నడిపి, అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేసిన కేసులో నటి కావ్యా థాపర్‌ను గురువారం తెల్లవారుజామున జుహు పోలీసులు అరెస్టు చేశారు. జేడబ్ల్యూ మారియట్ హోటల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 'ఎక్ మిని కథ','ఈ మాయ పేరెమిటో' సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది కావ్యా థాపర్. ముంబైలో నివాసం ఉంటున్న నటి కావ్యా థాపర్.. ఏదో పార్టీ కోసం అక్కడికి వచ్చి తన కారులో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తూర్పు శివారులోని తన నివాసానికి తిరిగి వస్తోంది. థాపర్ మద్యం మత్తులో ఉన్నందున ఆమె తన కారుతో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు కంట్రోల్ రూమ్, జుహు పోలీస్ స్టేషన్ నుండి నిర్భయ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. థాపర్ ఓ లేడీ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు. అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేయడంతో మహిళా కానిస్టేబుల్ కింద పడిపోయింది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్, డ్యూటీని నిర్వర్తించకుండా అడ్డుకున్న పబ్లిక్ సర్వెంట్‌పై క్రిమినల్ ఫోర్స్ చేసినందుకు నటిపై ఐపీసీ, మోటార్ వెహికల్స్ యాక్ట్‌లోని తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఆమెను అరెస్టు చేసి అంధేరీలోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆమెను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. ఆమెకు బెయిల్ మంజూరయ్యే వరకు అక్కడే ఉండవలసి ఉంటుంది.