ఇప్పటికే క్షమాపణలు చెప్పాను.. బెయిల్ ఇవ్వండి: కస్తూరి

సినీనటి కస్తూరి శంకర్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఉత్తర్వులను రిజర్వ్‌ చేసింది

By Medi Samrat  Published on  12 Nov 2024 8:30 PM IST
ఇప్పటికే క్షమాపణలు చెప్పాను.. బెయిల్ ఇవ్వండి: కస్తూరి

సినీనటి కస్తూరి శంకర్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఉత్తర్వులను రిజర్వ్‌ చేసింది. తమిళనాడులో నివసిస్తున్న తెలుగు మాట్లాడే వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మదురై పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి ఆమె బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు.మంగళవారం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆనంద్ వెంకటేష్, కస్తూరి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుండి తెలుగు మాట్లాడే ప్రజలు తమిళనాడులో నివసిస్తున్నారని, వారు ఈ భూమిలో భాగం అని జస్టిస్ వెంకటేష్ అన్నారు.

కస్తూరి తరఫు న్యాయవాది ఆమె తరపున వాదనలు వినిపిస్తూ కస్తూరి ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని, దాని గురించి వివరణ ఇచ్చారని, ముఖ్యంగా తెలుగు మాట్లాడే మహిళల గురించి ఆమె తప్పుగా చెప్పలేదని అన్నారు. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 14న ఉత్తర్వులు వెలువడనున్నాయి.

తెలుగు సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలోని పోలీసులు ఆమెపైనాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తెలుగు సమాజం మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుండి కస్తూరి కనిపించకుండా పోయారు.

Next Story