కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ కన్నీరు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నటి హేమ భావోద్వేగానికి గురయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 4:25 PM IST

కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ కన్నీరు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నటి హేమ భావోద్వేగానికి గురయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. చేయని తప్పునకు మీడియా తనను బలిపశువును చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గమ్మ సాక్షిగా తాను నిర్దోషినన్నారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చానని, అయితే ఈ ఏడాది పర్యటనకు ఒక ప్రత్యేకత ఉందని హేమ తెలిపారు. గత ఏడాది నాపై మీరంతా వేసిన నీలాపనిందలను దుర్గమ్మే తుడిచిపెట్టిందని అన్నారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులను మర్చిపోలేనని తెలిపారు. దయచేసి ఏదైనా వార్త ప్రచురించే ముందు నిజానిజాలు పూర్తిగా తెలుసుకోవాలని, ఈరోజు నేను గుడిలో ఉండి చెబుతున్నాను.. నేను ఆ తప్పు చేయలేదని అన్నారు.

Next Story