అత్యంత విషమంగా సీనియర్ నటి ఆరోగ్యం

టాలీవుడ్ నటి హేమా చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

By Medi Samrat  Published on  20 Dec 2023 3:31 PM IST
అత్యంత విషమంగా సీనియర్ నటి ఆరోగ్యం

టాలీవుడ్ నటి హేమా చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆమెకు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హేమా చికిత్సకు స్పందించడం లేదని ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో ఉన్న హేమా కుమారుడు కూడా వస్తున్నట్లు సమాచారం. ఆమె పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ, మేస్త్రి, ప్రేమాలయం వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కన్నడ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు.

నటి హేమా చౌదరి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ కళాకారిణి. ఆమె కన్నడతో సహా తెలుగు, మలయాళం, తమిళంలో 180 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణిగా కూడా ఆమెకు పేరు ఉంది. కన్నడ సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లో కూడా నటించారు. కన్నడ టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన సీరియల్ 'అమృత వర్షిణి'లో శకుంతలా దేవి పాత్రలో కనిపించారు. ఇటీవల ఆమె ఆరోగ్యంలో కూడా మార్పు కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story