రోడ్డు ప్ర‌మాదంలో న‌టి, యూట్యూబర్‌ గాయత్రి మృతి

Actress Gayathri Death In A Car Accident.యూట్యూబర్‌, నటి గాయత్రి శుక్ర‌వారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2022 9:12 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో న‌టి, యూట్యూబర్‌ గాయత్రి మృతి

యూట్యూబర్‌, నటి గాయత్రి శుక్ర‌వారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసింది. వివ‌రాల్లోకి వెళితే.. హోలీ సందర్భంగా గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి పబ్‌కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా గ‌చ్చిబౌలి వ‌ద్ద కారు అదుపుత‌ప్పి పుట్‌పాత్‌ను ఢీకొట్టింది. అనంత‌రం ఆ ప‌క్క‌నే గార్డెనింగ్ ప‌నులు చేస్తున్న మ‌హిళ‌ను ఢీకొట్టడంతో ఆ మ‌హిళ అక్క‌డికక్క‌డే మృతి చెందింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

తీవ్రంగా గాయ‌ప‌డిన రోహిత్ తో పాటు గాయ‌త్రిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. గాయత్రి అప్ప‌టికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం రోహిత్ చికిత్స పొందుతున్నాడు. కాగా.. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారును గాయ‌త్రి డ్రైవ్ చేయ‌గా.. అతి వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని బావిస్తున్నారు. కాగా.. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

గాయత్రి మృతిపై పలువురు సంతాపం తెలియ‌జేస్తున్నారు. న‌టి సురేఖ వాణి తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. 'డాలీ ఇది అన్యాయం.. నమ్మడానికి కష్టంగా ఉంది. నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు. టోటల్లీ బ్లాంక్ అంటూ పోస్ట్ చేసింది. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ సైతం గాయత్రితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ హార్ట్‌ బ్రేక్‌ సింబల్‌ను జతచేశాడు.


Next Story
Share it