బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి హాజరైన ఆరోపణలపై టాలీవుడ్ నటి ఆషి రాయ్‌ను బెంగళూరు పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసి 17 MDMA మాత్రలు, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆషి రాయ్‌ని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఆమె రక్త నమూనాను సేకరించారు. తన రక్త నమూనా ఇచ్చిన తర్వాత, ఆషి యూట్యూబ్‌లో ఒక వీడియోను విడుదల చేసింది. పార్టీ గురించి తనకు తెలియదని చెప్పింది. తాను పార్టీకి హాజరైనప్పటికీ లోపల ఏం జరుగుతోందో తనకు తెలియదని వివరించింది. ఇది పుట్టినరోజు పార్టీ అని అనుకున్నానని ఆమె వీడియోలో చెప్పింది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరింది. వాసు నాకు అన్నలాంటి వారు.. పార్టీకి వెళ్లి కేక్ కట్ చేసి వచ్చేశానని తెలిపింది. అంతకు మించి నాకు ఏమి తెలియదు.. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు.. దానితో నాకు సంబంధం కూడా లేదని చెప్పింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను.. దయచేసి మీరంతా సపోర్ట్ చేసి సాయం చేయండని వేడుకుంది. నటి హేమ గారిని గతంలో కొన్నిసార్లు కలిశాను తప్ప ఆమెతో పరిచయం లేదు.. ఈ పార్టీకి ఆమె హాజరైందా లేదా అన్నది తనకు తెలియదని ఆషి రాయ్ సమాధానం ఇచ్చింది.
ఇక రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలోని ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై క్రైమ్ బ్రాంచ్ దాడి చేసి మే 20న 17 MDMA మాత్రలు, కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు నుండి 25 మంది మహిళలు హాజరయ్యారు. ఫామ్‌హౌస్ గోపాల రెడ్డికి చెందినదని, హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని నిర్వహించారని ఆరోపించారు.