టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. మొన్నటికిమొన్న రానా, నితిన్, నిఖిల్, నిహారికలు ఓ ఇంటివారవగా.. తాజాగా తెలుగమ్మాయి, హీరోయిన్ ఆనంది కూడా వివాహం చేసుకుంది. ఎటువంటి హంగామా లేకుండా.. నిరాడంబరంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. ఆనంది సొంతఊరు వరంగల్‌లోని ఓ హోటల్‌లో ఈ వివాహం జరిగింది.
అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో సోక్రటీస్, ఆనందిల వివాహం జరిగింది. సోక్రటీస్ తమిళ ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడని సమాచారం. ఇదిలావుంటే.. ఆనంది తెలుగులో ఈరోజుల్లో, బస్ట్ స్టాప్, నాయక్, ప్రియతమా నీవచటకుశలమా, గ్రీన్ సిగ్నల్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ్‌లో బిజీ అయ్యింది.
ఇక తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'జాంబి రెడ్డి' రిలీజ్‌కి సిద్దంగా ఉంది. అయితే.. కెరీర్ మంచి పొజిషన్‌లో ఉండగానే ఆనంది ఇంత సడన్‌గా ఎందుకు పెళ్లి చేసుకుందని సినీ అభిమానులు, టాలీవుడ్ వర్గాలవారు చర్చించుకుంటున్నారు.