నటి సాయి ధన్షికతో విశాల్ నిశ్చితార్థం

తమిళ నటుడు విశాల్ నటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్నారు.

By Medi Samrat
Published on : 29 Aug 2025 2:52 PM IST

నటి సాయి ధన్షికతో విశాల్ నిశ్చితార్థం

తమిళ నటుడు విశాల్ నటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను అభిమానుల‌తో పంచుకున్నారు.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేస్తూ విశాల్ ఇలా వ్రాశాడు. 'నా ప్రత్యేకమైన‌ పుట్టినరోజున నన్ను ఆశీర్వదించినందుకు ప్రియమైన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు సాయి ధన్షికతో నిశ్చితార్థం జరిగిన శుభవార్తను నా కుటుంబంతో పంచుకోవడం ఆనందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పటిలాగే, మీ ఆశీస్సులు, శుభాకాంక్షలను కోరుకుంటున్నాను.

ఈ ఏడాది మేలో జరిగిన ఓ కార్యక్రమంలో విశాల్, సాయి ధన్షిక తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. నిశ్చితార్థం రోజు ప్రత్యేకం.. ఎందుకంటే విశాల్ పుట్టినరోజు కూడా ఇదే రోజు. విశాల్, సాయి ధన్షిక గత 15 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు కూడా.

విశాల్, సాయి ధన్షిక నిశ్చితార్థం గురించి చర్చలతో పాటు వారి మధ్య వయస్సు వ్యత్యాసం కూడా చర్చకు వచ్చింది. నిజానికి ఈ పుట్టినరోజుకే విశాల్‌కి 48 ఏళ్లు నిండాయి. ప్రస్తుతం ధన్షిక వయసు 35 ఏళ్లు. 1989 నవంబర్ 20న జన్మించిన సాయి ధన్షికకు నవంబర్‌లో 36 ఏళ్లు నిండుతాయి. అటువంటి పరిస్థితిలో ఇద్దరి మధ్య 12 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంది.

Next Story