తమిళ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్‌

Actor Vikram tests positive for coronavirus. పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రముఖ తమిళ నటుడు విక్రమ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది

By అంజి
Published on : 16 Dec 2021 5:43 PM IST

తమిళ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందనుకున్న సమయంలో.. ఓమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో విజృంభణకు సిద్ధమైంది. తాజాగా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రముఖ తమిళ నటుడు విక్రమ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ట్విట్టర్‌లో ఒక నెటిజన్‌కు ప్రతిస్పందిస్తూ విక్రమ్‌ మేనేజర్ సూర్యనారాయణన్ అదే విషయాన్ని ధృవీకరించారు. హీరో విక్రమ్‌ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా గత రెండు వారాల నుండి విక్రమ్‌.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో విక్రమ్‌ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. దీంతో అతడికి ఏ వేరియంట్‌ సోకిందనేది త్వరలో తెలియనుంది.

ఈ నెల ప్రారంభంలో హీరో విక్రమ్‌ దర్శకుడు పా రంజిత్‌తో తాత్కాలికంగా చియాన్ 61 అనే టైటిల్‌తో తన తదుపరి చిత్రానికి జతకట్టబోతున్నట్లు ప్రకటించబడింది. డిసెంబర్ 2 గురువారం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ ప్రకటన చేసింది. విక్రమ్ ప్రస్తుతం తన కుమారుడు, నటుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించిన మహాన్ విడుదలకు సిద్ధమవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం, సెవెన్ స్క్రీన్ స్టూడియో ద్వారా బ్యాంక్రోల్ చేయబడింది. ఈ సినిమాలో నటుడు బాబీ సింహా, వాణీ భోజన్‌ నటిస్తున్నారు.

Next Story