శివసేనలో చేరనున్న ప్రముఖ బాలీవుడ్ నటి
Actor Urmila Matondkar to join Shiv Sena. ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్
By Medi Samrat Published on 30 Nov 2020 7:41 AM GMTప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ నేడు(సోమవారం) శివసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన 'రంగీలా' బ్యూటీ ఊర్మిళ.. 2019 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంది. అదే ఏడాది పార్లమెంట్ ఎన్నికలలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ చినయ్య చేతిలో ఓటమి పాలైంది. ఎన్నికల అనంతరం అదే ఏడాది సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోని కొన్ని రాజకీయాల కారణంగానే తాను పార్టీకి దూరం అవుతున్నానని.. అక్కడ పెద్ద లక్ష్యం కోసం పనిచేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు.. పార్టీలోని స్వార్థ ప్రయోజనాలతో పోరాటం చేయడం చాలా కష్టమంటూ ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ సమయంలో ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దేవరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బయటకు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. ముంబైలో తన ఓటమికి పార్టీలోని కొన్ని వర్గాలు పని చేశాయని తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పై తనకు భ్రమలు తొలిగిపోయాయని ఊర్మిళ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా వస్తున్న ఊర్మిళ.. సోమవారం నుంచి కొత్తగా తన రాజకీయ ప్రయాణం ప్రారంభించబోతున్నారు.
గత కొంతకాలంగా ఊర్మిళ శిశసేనలో చేరుతారనే వార్తలు మహారాష్ట్రలో జోరుగా వినిపిస్తున్నాయి. శివసేన అధ్యక్షుడు ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో పని చేయడానికి ఊర్మిళా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమెను మహారాష్ట్ర శానస మండలికి శివసేన నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన ఊర్మిళ పేరును గవర్నర్ భగత్సింగ్ కొష్యారికి పంపారు. గవర్నర్ కు 12 మంది సభ్యులతో కూడిన జాబితాలో శివసేన నుంచి ఊర్మిళా మండోద్కర్ - చంద్రకాంత్ రఘువంషి - విజయ్ కరంజ్కర్ - నితిన్ బంగుడే పాటిల్ పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఊర్మిళ శివసేన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.