రూ. 58 లక్షలు మోసపోయిన స్టార్ హీరో తల్లి

Actor Tiger Shroff's Mother Cheated Of 58 Lakh, Files Police Complaint. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ మోసపోయింది.

By Medi Samrat  Published on  10 Jun 2023 5:45 AM GMT
రూ. 58 లక్షలు మోసపోయిన స్టార్ హీరో తల్లి

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ మోసపోయింది. తన కుమారుడి సంస్థలో స్టాఫర్‌గా నియమించుకున్న కిక్‌బాక్సర్ ఆమెను 58.53 లక్షలు మోసం చేశాడని ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాంటాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో అయేషా ష్రాఫ్ ఫిర్యాదు చేసింది. అయేషా ష్రాఫ్‌ ఫిర్యాదు మేరకు ఆమెను రూ.58 లక్షలకు మోసం చేసిన నిందితుడిన అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.

MMA మ్యాట్రిక్స్ కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్‌ అలాన్ ఫెర్నాండెజ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. టైగర్ ష్రాఫ్ జిమ్ పేరు వాడుకుని, వివిధ టోర్నమెంట్లు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు కాజేశారన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు రూ.58 లక్షల మేర మోసం చేసినట్లు ఆమె శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయేషా శ్రాఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపిసి సెక్షన్ 420, 408, 465, 467, 468 కింద అభియోగాలు నమోదు చేశారు. అలాన్ ఫెర్నాండెజ్ 2018లో MMA మ్యాట్రిక్స్ కంపెనీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. MMA మ్యాట్రిక్స్ కంపెనీ జిమ్ టైగర్ ష్రాఫ్ యాజమాన్యంలో ఉంది. టైగర్ తల్లి అయేషా జిమ్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ రిక్రూట్‌మెంట్‌లకు శిక్షణ ఇవ్వడానికి అలాన్ రూ.3 లక్షల వేతనానికి ఉద్యోగంలో చేరాడు. కానీ అలాన్ మాత్రం టోర్నీల నిర్వహణ ముసుగులో తప్పుడు మార్గంలో భారీగా డబ్బు కూడబెట్టాడు. టైగర్ ష్రాఫ్ జిమ్ పేరును వాడుకుని, భారతదేశంలో మాత్రమే కాక విదేశాలలో కూడా మొత్తం 11 టోర్నమెంట్‌లు నిర్వహించారు. ఫలితంగా డిసెంబర్ 2018 నుండి జనవరి 2023 వరకు తన పర్సనల్ ఖాతాలో రూ. 58,53,591 జమ చేశాడు. దీంతో ఆయేషా ష్రాఫ్ మే 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story