బాలీవుడ్ సెలెబ్రెటీలకు ఇటీవలి కాలంలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. సల్మాన్ ఖాన్ తర్వాత, ఇప్పుడు నటి స్వర భాస్కర్‌కి బెదిరింపులు మొదలయ్యాయి. ఆమె నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా అజ్ఞాత వ్యక్తి/వ్యక్తులు లేఖ పంపారు. ఆ లేఖ ద్వారా హత్య చేస్తామని బెదిరింపు వచ్చింది. ముంబైలోని వెర్సోవాలో ఉన్న నటి నివాసానికి లేఖ పంపబడింది. ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఒక అధికారి తెలిపారు.
లేఖ అందుకున్న తర్వాత, స్వర భాస్కర్ వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. "ఫిర్యాదు ఆధారంగా, మేము గుర్తు తెలియని వ్యక్తులపై నాన్-కాగ్నిసబుల్ నేరం నమోదు చేసాము" అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. హిందీలో చేతితో రాసిన లేఖ అని తెలుస్తోంది. స్వరా ప్రాణాలకు హాని కలిగిస్తామని చెప్పుకొచ్చారు. సావర్కర్‌ను అవమానించినందుకు హెచ్చరిస్తూ దుర్భాషలతో నిండిపోయింది. లేఖపై చివర్లో 'ఇస్ దేశ్ కే నౌజవాన్' అని సంతకం చేశారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశంలోని యువత సహించబోదని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.