రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ న‌టుడు.. కాలు తీసేసిన వైద్యులు

Actor Suraj Kumar Injured In Major Road Accident He Lost His Right Leg. క‌ర్ణాట‌క రాష్ట్రం మైసూరు-గుండ్లుపేట హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ కుమార్

By Medi Samrat  Published on  26 Jun 2023 2:34 PM IST
రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ న‌టుడు.. కాలు తీసేసిన వైద్యులు

క‌ర్ణాట‌క రాష్ట్రం మైసూరు-గుండ్లుపేట హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ కుమార్(ధ్రువన్) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్ర‌మాదంలో సూరజ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయ‌న‌ను మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సూరజ్ కుమార్ డా. రాజ్‌కుమార్ భార్య పార్వతమ్మ మేనల్లుడు. నివేదికల ప్రకారం.. ప్రమాదంలో సూరజ్ కుడి కాలు నుజ్జునుజ్జ‌య్యింది. దీంతో వైద్యులు అత‌డి కాలును తొల‌గించారు.

25వ తేదీ సాయంత్రం 24 ఏళ్ల సూరజ్ కుమార్.. తన బైక్‌పై మైసూరు నుంచి ఊటీకి బ‌య‌లుదేరాడు. మార్గ‌మ‌ధ్యంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్తున్నాడు. స‌రిగ్గా హిరికత్తి గేట్ దగ్గరలో టిప్పర్ లారీ సూరజ్ కుమార్ బైక్‌ను ఢీకొట్టింది. తీవ్ర‌గాయాల‌తో కొట్టుమిట్టాడుతున్న‌ సూరజ్ ను మైసూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన‌ట్లు నివేదికలు తెలిపాయి. సాయంత్రం 4 గంటల సమయంలో గుండ్లుపేట తాలూకాలోని హిరికత్తి గేట్ వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూనే తన పేరును ధృవన్‌గా మార్చుకున్నాడు సూరజ్ కుమార్. శివ రాజ్‌కుమార్, అతని భార్య గీత ఆసుపత్రిలో సూరజ్‌ను పరామర్శించారు. సూరజ్ సినీ కెరీర్ 2019 సంవత్సరంలో దర్శకుడు రఘు కోవి సినిమాతో ప్రారంభ‌మైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. దీని తర్వాత మరో సినిమా చేసినా సూరజ్ కుమార్ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.


Next Story