ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ధని స్టాక్స్ లిమిటెడ్‌లో రుణ మోసాలకు పాల్పడ్డారు. పలువురి డీటైల్స్ ఉపయోగించి లోన్ లను కొందరు తీసుకున్నారు. తాజాగా సన్నీ లియోన్ ఐడెంటిటీని కూడా దొంగతనం చేశారు. తన పాన్ కార్డు డీటైల్స్ తీసుకుని కొందరు మోసాలకు పాల్పడ్డారని సన్నీ లియోన్ తెలిపింది. సన్నీ లియోన్ ట్వీట్ చేస్తూ "This just happened to me. INSANE. Some idiot used my Pan to take a 2000 RS loan and FCK'd my CIBIL score (SIC)" తెలిపింది.
లోన్ ఫ్రాడ్ బాధితురాలిని తాను అయ్యానని సన్నీ లియోన్ ట్వీట్ ద్వారా తెలియజేసింది. గుర్తుతెలియని వ్యక్తులు తన పాన్ కార్డ్ ఉపయోగించి లోన్ తీసుకున్నారని సన్నీ లియోన్ తెలిపింది. లోన్ తీసుకున్న విషయం కూడా తనకు తెలియదని.. దీని వల్ల తన సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడిందని ట్విట్టర్‌లో వివరించింది. ఆమె ట్వీట్ కాసేపటి తర్వాత డిలిట్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె మరో ట్వీట్ చేశారు.
ఇండియా బుల్స్‌కు చెందిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ధని స్టాక్స్ లిమిటెడ్ విషయపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. పలువురు వ్యక్తుల పాన్ కార్డు డీటైల్స్ ను దక్కించుకున్న కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు. జర్నలిస్ట్ ఆదిత్య కాల్రా కూడా ఈ బాధితుల జాబితాలో ఉన్నారు. తన పాన్ నెంబర్‌తో వేర్వేరు అడ్రస్‌లలో రుణాలు తీసుకున్నట్టు క్రెడిట్ రిపోర్ట్‌లో బయటపడిందని ఆదిత్య కాల్రా తెలిపారు. ఇండియాబుల్స్‌కు చెందిన ఇన్‌స్టంట్ లోన్ యాప్ ధనిలో తన పాన్ నెంబర్‌తో ఈ లోన్ తీసుకున్నట్టు బయటపడిందని ట్వీట్ చేశారు. ఇండియాబుల్స్ గ్రూప్ కింద ధని ఉంది, ఇది కిరాణా సామాగ్రి, స్టాక్ బ్రోకరేజ్, క్రెడిట్ పరిమితి రూ. 5 లక్షలతో క్రెడిట్ కార్డ్, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ అందించడం వంటి సేవలను అందిస్తుంది.