'బహుబలి' నటుడు సత్యరాజ్‌ ఇంట్లో విషాదం

Actor Sathyaraj's younger sister Kalpana Mandradiar passes away. నటుడు సత్యరాజ్‌ బహుబలి సినిమాతో కట్టప్ప పాత్ర పోషించి దేశ వ్యాప్తంగా విశేషంగా ప్రేక్షకాదరణ పొందాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో

By అంజి  Published on  6 Dec 2021 9:01 AM IST
బహుబలి నటుడు సత్యరాజ్‌ ఇంట్లో విషాదం

నటుడు సత్యరాజ్‌ బహుబలి సినిమాతో కట్టప్ప పాత్ర పోషించి దేశ వ్యాప్తంగా విశేషంగా ప్రేక్షకాదరణ పొందాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో సత్యరాజ్‌ నటించారు. ఇటీవల సత్యరాజ్‌ కుమారుడు కూడా హీరోగా పరిచయం అయ్యారు. కిషోర్‌ ఎన్‌ తెరకెక్కిస్తున్న 'మయోన్‌' అనే సినిమాలో శిబి సత్యరాజ్‌ హీరోగా నటిస్తున్నారు. డబుల్‌ మీనింగ్‌ ప్రొడక్షన్‌లో అరుణ్‌ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే నటుడు సత్యరాజ్‌ చెల్లెలు కల్పనా మండ్రాడియార్‌ తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 66 సంవత్సరాలు.

ఆమెకు ఎ. మహేందర్ అనే కుమారుడు ఉన్నాడు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని కాంగేయంకు చెందిన కల్పన వారం రోజులుగా అనారోగ్యంతో ఉన్నట్లు నటుడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సోదరి మృతితో సత్యరాజ్‌ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యరాజ్‌కి, అతని కుటుంబానికి చాలా మంది అభిమానులు చాలా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Next Story