న్యూడ్ ఫోటో షూట్ : రణవీర్‌ను ప్రశ్నించిన పోలీసులు
Actor Ranveer Singh Records Statement In Nude Photoshoot Case. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫోటో షూట్ చేశాడు.
By Medi Samrat Published on 29 Aug 2022 3:53 PM ISTబాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫోటో షూట్ చేశాడు. ఈ ఫోటోషూట్ కారణంగా, అతను సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాడు. న్యూడ్ ఫోటో షూట్ కారణంగా రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. అప్పటి నుండి అతని సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో రణ్‌వీర్ కనిపించాడు.
రణవీర్ సింగ్ ఈరోజు చెంబూర్ పోలీస్ స్టేషన్‌కు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. ఉదయం 7 గంటలకు విచారణ అధికారి ముందు హాజరు అయిన రణవీర్.. వాంగ్మూలం రికార్డ్ చేసిన అనంతరం 9.30 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. ఈ సమయంలో పోలీసులు రణ్‌వీర్‌కు పలు ప్రశ్నలు సంధించారు.
న్యూడ్ ఫోటో షూట్ కోసం ఏ కంపెనీ కోసం చేశారు, ఫోటో షూట్ ఎప్పుడు, ఎక్కడ జరిగింది.? ఇలాంటి ఫోటోషూట్ వల్ల జనాల మనోభావాలు దెబ్బతింటాయని మీకు ఏమైనా ఆలోచన ఉందా?.. ఇలా ఎన్నో ప్రశ్నలతో రణ్‌వీర్‌పై విరుచుకుపడ్డారు. రణవీర్, అతని బృందం తదుపరి విచారణలో పాల్గొనడం ద్వారా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ముంబై పోలీసులకు రణవీర్‌పై ఫిర్యాదు అందిన తరువాత ఆగస్టు 22 న సమన్లు పంపారు. సమన్లలో సోమవారం హాజరుకావాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యేందుకు రణవీర్ 2 వారాల సమయం అడిగాడు. ఆ తర్వాత విచారణ నిమిత్తం రణ్‌వీర్ ఈరోజు చెంబూరు పోలీసు స్టేషన్‌కు వచ్చాడు.
ఇదిలా ఉంటే, పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ చాలా బోల్డ్ ఫోటో షూట్ చేశాడు. ఫోటోల్లో పూర్తి నగ్నంగా కనిపించాడు. కార్పెట్‌పై కూర్చున్న రణవీర్ విభిన్న స్టైల్స్‌లో పోజులిచ్చాడు. రణవీర్ న్యూడ్ ఫోటో షూట్‌కి చాలా మంది పెద్ద నటీనటులు మద్దతు పలికారు.