ప్ర‌ముఖ న‌టుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఇంట విషాదం

Actor R Narayana Murthy Mother passed away.ప్రముఖ నటుడు, ద‌ర్శ‌కుడు ఆర్‌.నారాయ‌ణమూర్తి ఇంట విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2022 1:08 PM IST
ప్ర‌ముఖ న‌టుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఇంట విషాదం

ప్రముఖ నటుడు, ద‌ర్శ‌కుడు ఆర్‌.నారాయ‌ణమూర్తి ఇంట విషాదం నెల‌కొంది. నారాయ‌ణ మూర్తి త‌ల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె కాకినాడ‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్పిలో చికిత్స పొందుతున్నారు. మంగ‌ళవారం ఉద‌యం ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 93 సంవ‌త్స‌రాలు. అంత్య‌క్రియ‌ల నిమిత్తం ఆమెను స్వ‌గ్రామ‌మైన మ‌ల్లంపేట‌కు తీసుకువెళ్లారు. విజ‌యన‌గరంలో ఉన్న నారాయ‌ణ‌మూర్తికి త‌ల్లి చ‌నిపోయిన విష‌యాన్ని ఆయ‌న సోద‌రుడు తెలియ‌జేశారు. వెంట‌నే నారాయ‌ణ మూర్తి మ‌ల్లంపేట‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రజా సమస్యలపై సినిమాలు తీసి అనేక విజయాలు సాధించారు ఆర్ నారాయణ మూర్తి. హీరోగా, ఆర్టిస్ట్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా సక్సెస్ అయి పీపుల్స్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంత సక్సెస్ సాధించినా ఎంతో నిరాడంబరంగా ఉంటారు. సినిమాలే కాక తన ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పెళ్లి చేసుకోకుండా సినిమాలకి, సమాజానికి ఆయన జీవితాన్ని అంకితమిచ్చారు.

Next Story