చేతికి, కాలుకి గాయాలయ్యాయి.. ప్ర‌మాదంపై యంగ్ హీరో ప్ర‌క‌ట‌న‌

నవీన్ పొలిశెట్టి కుడిచేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్‌తో పాటు కాలికి కూడా గాయమైంది. అతడు నెమ్మదిగా కోలుకుంటున్నాన‌ని.. కఠినంగా ఉందని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు.

By Medi Samrat  Published on  17 July 2024 9:58 AM GMT
చేతికి, కాలుకి గాయాలయ్యాయి.. ప్ర‌మాదంపై యంగ్ హీరో ప్ర‌క‌ట‌న‌

నవీన్ పొలిశెట్టి కుడిచేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్‌తో పాటు కాలికి కూడా గాయమైంది. అతడు నెమ్మదిగా కోలుకుంటున్నాన‌ని.. కఠినంగా ఉందని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాన‌ని చెప్పాడు. తన రాబోయే చిత్రాల గురించి ఉత్సాహంగా ఉన్నానని కూడా పేర్కొన్నాడు. సినిమాల ద్వారా తన అభిమానులతో కనెక్ట్ కాలేకపోతున్నందుకు నవీన్ క్షమాపణలు చెప్పాడు. మార్చిలో నవీన్ అమెరికాలో బైక్ ప్రమాదానికి గురయ్యాడు. అతని టీమ్‌ ఈ వార్తలను ధృవీకరించినప్పటికీ.. న‌వీస్‌ ఇప్పటివరకూ ప్ర‌మాదం గురించి మౌనంగా ఉన్నాడు.

న‌వీన్‌ ప్రకటనలో.. "దురదృష్టవశాత్తూ ఇటీవల నా కుడిచేయి ఫ్రాక్చర్ అయ్యింది.. నా కాలికి కూడా గాయమైంది. ఇది నాకు చాలా కష్టమైన, బాధాకరమైన సమయం. నేను సినిమాలలో న‌టించ‌లేను. మీతో కనెక్ట్ అవ్వలేను. ఈ గాయం కారణంగా నేను కోరుకున్నంత వేగంగా సినిమాలను మీకు అందించలేకపోతున్నందుకు క్షమించండి. రికవరీ నెమ్మదిగా.. చాలా కఠినంగా ఉంది. కానీ నేను పూర్తిగా కోలుకోవడానికి వైద్య నిపుణులతో కలిసి పని చేస్తున్నాను. దీనికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా.. నేను బలంగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. నా రాబోయే చిత్రాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. డెవలప్‌మెంట్ పనులు ప్రతిరోజూ జోరుగా జరుగుతున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత నేను వాటిని షూట్ చేస్తాను. దయచేసి నా నుండి వచ్చే అప్‌డేట్‌లను మాత్రమే నమ్మండ‌ని రాశారు.

నవీన్ పొలిశెట్టి చివరిగా అనుష్క శెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో కనిపించారు. ఆయన తర్వాత కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో 'అనగనగా ఒక రాజు' చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాలో శ్రీలీల తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.

Next Story