ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌వ‌దీప్‌

Actor Navdeep attends Investigation at ED office.సినీ న‌టుడు న‌వ‌దీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచార‌ణ‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2021 6:08 AM GMT
ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌వ‌దీప్‌

సినీ న‌టుడు న‌వ‌దీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న ఈడీ కార్యాల‌యానికి వ‌చ్చారు. మ‌నీలాండ‌రింగ్ కోణంలో ఆయ‌న బ్యాంకు ఖాతాల‌ను అధికారులు ప‌రిశీలించ‌నున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో బ్యాంకు లావాదేవీలపై కూడా ఈడీ విచారించ‌నుంది. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆయ‌న‌కు ఉన్న సంబంధాల‌పై అధికారులు న‌వ‌దీప్‌ను ప్ర‌శ్నించ‌నున్నారు. ఎఫ్ క్ల‌బ్‌లో జ‌రిగే పార్టీల‌కు త‌ర‌చూగా హాజ‌ర‌య్యే ప్ర‌ముఖులు ఎవ‌రు..? అక్క‌డ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తారా..? అనే అంశాల‌పై విచారించ‌నున్నారు. న‌వ‌దీప్‌తో పాటు ఎఫ్ క్ల‌బ్ మేనేజ‌ర్‌ని సైతం ఈడీ అధికారులు విచారించ‌నున్నారు.

డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే ఈడీ అధికారులు.. పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ‌ను విచారించిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల విరామం అనంత‌రం ఈడీ అధికారులు ఈ కేసులో మ‌ళ్లీ విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. గ‌త 10 రోజులుగా ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది.

Next Story