మాస్టర్ భరత్ జీవితంలో ఊహించని విషాదం

మాస్టర్ భరత్ గా ఎన్నో సినిమాల్లో నటించిన వ్యక్తి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

By Medi Samrat
Published on : 19 May 2025 3:15 PM IST

మాస్టర్ భరత్ జీవితంలో ఊహించని విషాదం

మాస్టర్ భరత్ గా ఎన్నో సినిమాల్లో నటించిన వ్యక్తి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. భరత్ తల్లి కన్నుమూశారు. భ‌ర‌త్ త‌ల్లి కమలాసిని ఆదివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. కమలాసిని గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భ‌ర‌త్‌కు మాతృ వియోగం విష‌యం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయ‌న‌కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి కమలాసిని భౌతిక కాయాన్ని సందర్శించారు.

బాల న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భ‌ర‌త్‌ రెడీ, వెంకీ, ఢీ, కింగ్, దూకుడు, పోకిరి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీతో నవ్వించాడు. తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించాడు భరత్.

Next Story