Dharmendra : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర (వీడియో)

ప్రముఖ నటుడు ధర్మేంద్ర బుధవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

By -  Medi Samrat
Published on : 12 Nov 2025 9:13 AM IST

Dharmendra : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర (వీడియో)

ప్రముఖ నటుడు ధర్మేంద్ర బుధవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. 89 ఏళ్ల ధర్మేంద్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ వైద్య పర్యవేక్షణ నిమిత్తం ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. నవంబర్ 10న ఆయ‌న‌ను ICUకి తరలించారు.

నవంబర్ 11 న ఆయ‌న‌ భార్య హేమ మాలిని, కుమార్తె ఈషా డియోల్ ధర్మేంద్ర స్థిరంగా ఉన్నార‌ని, కోలుకుంటున్నాడర‌ని తెలిపారు. ఈరోజు ఆయనను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థనలు, శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు.



ధర్మేంద్ర ఆరోగ్యం గురించి డాక్టర్ ప్రతీత్ సమ్దానీ మాట్లాడుతూ, 'ధర్మేంద్ర జీ ఉదయం 7.30 గంటలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఆయన‌ ఇంట్లో చికిత్స పొందుతారు, ఎందుకంటే ఆయ‌న‌కు ఇంట్లోనే చికిత్స చేయించాలని కుటుంబం నిర్ణయించుకుంది.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ధర్మేంద్రను డియోల్ కుటుంబం ఇంటికి తీసుకొచ్చింది. ధర్మేంద్రను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ధర్మేంద్రను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చారు. బాబీ డియోల్ తన కారులో అంబులెన్స్‌ని ఫాలో అయ్యారు. కుటుంబసభ్యులుగానీ, వైద్యుల నుంచి గానీ ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని భావిస్తున్నారు.

Next Story