స్కూల్ డేస్ స్నేహం.. అతడినే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్

నటి కీర్తి సురేష్, గోవాలో తన ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకుంది. ఈ రోజు వివాహం జరుగ‌గా.. ఇందుకు సంబంధించిన‌ వేడుక ఫోటోలు సోష‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

By Medi Samrat  Published on  12 Dec 2024 4:33 PM IST
స్కూల్ డేస్ స్నేహం.. అతడినే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్

నటి కీర్తి తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కీర్తి సురేష్, ఆంటోనీ తటిల్ అయ్యంగార్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కీర్తి పసుపు, ఆకుపచ్చ డ్రెస్ ధరించి కనిపించింది.

15 ఏళ్లుగా కీర్తి సురేశ్, ఆంటోనీ స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆంటోనీది వ్యాపార కుటుంబం. చెన్నై, కొచ్చిలో వారికి వ్యాపారాలు ఉన్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు స్నేహం ఉంది. కాలేజ్ రోజుల్లో వారి స్నేహం ప్రేమగా మారింది. వర్క్ పరంగా కీర్తి సురేష్ వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్‌లో కనిపిస్తుంది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

మరోవైపు ఆమె త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుంది. దళపతి విజయ్, సమంత జంటగా కలిసి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తేరి' సినిమాని బాలీవుడ్‌లో బేబీ జాన్‌గా రీమేక్ చేయనున్నారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటించనుండగా.. సమంత పాత్రని కీర్తి సురేష్ పోషించనుంది.

Next Story