ప్రముఖ నటుడు, పొలిటికల్ లీడర్ కమల్ హాసన్‌పై తమిళనాడు సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బారిన పడిన కమల్‌హాసన్.. కోలుకున్న వెంటనే ఓ షోల్ పాల్గొనడంపై సీరియస్ అవుతూ నోటీసులు ఇచ్చింది. ఇటీవల కమల్ హాసన్ అమెరికా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ రావడంతో డాక్టర్ల సలహాలు, సూచనలతో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కమల్ కోలుకోని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌కు, ఇతర నాయకులకు, సినిమా సెలబ్రిటీలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
అయితే కమల్‌కి కరోనా సోకడంతో ఆయన చేస్తున్న ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజన్ 5 షోకి కూడా బ్రేక్ ఇచ్చాడు. దీంతో కమల్ ప్లేస్‌లో ప్రముఖ నటి రమ్యకృష్ణ వీకెండ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా కమల్ కరోనా మహమ్మారి నుండి కోలుకుని.. ఐసోలేషన్‌లో ఉండకుండా బిగ్ బాస్ షో షూటింగ్ పాల్గొన్నారు. దీంతో ఆయనపై తమిళనాడు ప్రభుత్వం ఫైర్ అయ్యింది. కరనా నిబంధనలు ఉల్లంఘించి బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొనడం సరికాదని చెప్పింది. పూర్తిగా కోలుకోకముందే షూటింగ్‌లకు హాజరైతే వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలని కమల్ హాసన్‌కు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది.