ప్రముఖ నటి హనీ రోజ్‌పై సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసినందుకు 60 ఏళ్ల వృద్ధుడిని కొచ్చిలో అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొచ్చి నగర పోలీసులు ఆదివారం 30 మందిపై కేసు నమోదు చేశారు. హనీరోజ్ కేరళకు చెందిన ఓ బిజినెస్ మేన్ తాను ఎక్కడకు వెళితే అక్కడికి వస్తూ తనను వేధిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
కొచ్చి శివారులోని కుమబాలమ్‌కు చెందిన షాజీని సోమవారం అరెస్టు చేశారు. కొచ్చి సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనీష్ జాయ్ మాట్లాడుతూ ఇతరులను కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఆ వ్యక్తి గతంలో ఓ ఈవెంట్ కు తనను పిలిచాడని, ఇతర కారణాల వల్ల తాను హాజరుకాలేదని హానీ రోజ్ తెలిపింది. దాన్ని మనసులో పెట్టుకుని తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు తనను వెంబడించాడని ఆరోపించింది.