మారుతి దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమా!
Actor Gopichand and director Maruthi team up for a film. "ఈ రోజుల్లో", "బస్ స్టాప్"వంటి చిత్రాలను తీసిన డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమా.
By Medi Samrat Published on 7 Jan 2021 3:31 PM IST"ఈ రోజుల్లో", "బస్ స్టాప్"వంటి చిత్రాలను తీసిన డైరెక్టర్ మారుతి.. ఆ సినిమాలు విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలైన ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సినిమాల గురించి డైరెక్టర్ మారుతి ఎలాంటి ఈ ప్రస్తావన తీసుకురాలేదు.
అయితే ప్రస్తుతం మారుతి తన తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశారు.దర్శకుడు మారుతి తన పదవ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ తో తీయనున్నట్లు స్వయంగా ఈ విషయాన్ని మారుతి తన ట్విట్టర్ ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ తెలియజేశారు. ఈ వీడియోలో రావు రమేష్ కోర్టులో న్యాయమూర్తిగా తీర్పునిస్తూ"సాక్షాలు అన్నీ పరిశీలించిన మీదట ముద్దాయి మారుతి ప్రతి రోజు పండుగ సినిమా ద్వారా తీయబోయేది ఈ కథ" అంటూ తీర్పు ఇస్తారు.
డైరెక్టర్ మారుతి పదవ సినిమాగా గోపీచంద్ 29వ సినిమాగా తెరకెక్కించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు, యు.వి. క్రియేషన్స్ కలసి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో వచ్చిన "బలే బలే మగాడివోయ్","ప్రతి రోజు పండగే" వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే అతి త్వరలోనే ఈ సినిమా పేరును, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ మారుతి తెలియజేశారు. మారుతి _గోపీచంద్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా గురించి తెలియజేస్తూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.