బాలీవుడ్‌లో మ‌రో విషాదం.. క‌రోనాతో యువ న‌టి మృతి

Actor Divya Bhatnagar dies of Covid-19. ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య భట్నగర్ కరోనాతో క‌న్నుమూశారు.

By Medi Samrat  Published on  7 Dec 2020 8:14 AM GMT
బాలీవుడ్‌లో మ‌రో విషాదం.. క‌రోనాతో యువ న‌టి మృతి

ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య భట్నగర్ కరోనాతో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా క‌రోనా బాధ‌ప‌డుతున్న ఆమె.. ముంబ‌యిలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అధిక రక్తపోటుతోపాటు నిమోనియాతో బాధపడుతున్న దివ్యాకు వైద్యులు వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ.. సోమవారం తెల్ల‌వారు జామున ఆమె మృతి చెందినట్లు ఆమె స‌న్నిహితులు వెల్ల‌డించారు.

ఆసుపత్రిలో చేర్చిన సమయంలో దివ్య తల్లి మాట్లాడుతూ.. వారంరోజులుగా దివ్య జ్వరంతో బాధ పడుతోందని ఆక్సీ మీటర్ తో చెక్ చేస్తే ఆమె ఆక్సిజన్ 71కి పడిపోవడంతో ఆమెను ఆస్ప‌త్రికి తరలించారు అని పేర్కొన్నారు. ఆమె ఎక్కువగా టీవీ సీరియళ్లలో నటించింది. ఏ రిస్తా క్యా ఖేల్తా హై అనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. యువ‌న‌టి మృతితో టెలివిజ‌న్ రంగం దిగ్భ్రాంతిలోకి వెళ్లింది. ఆమె మృతి ప‌ట్ల స‌హ‌న‌టులు శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టిస్తున్నారు.
Next Story