ప్రముఖ హిందీ సినీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 12న ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఇంటి నుంచే ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. విలే పార్లే శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను అక్టోబర్ 31న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పటినుంచో ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. నవంబర్ 12న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నవంబర్ 24న 89 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ధర్మేంద్ర మరణం గురించి తెలియజేసారు. ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్, ఆయన ప్రాణ స్నేహితుడు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అగస్త్య నంద వంటి ప్రముఖులు ధర్మేంద్రకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
ధర్మేంద్ర కేవల్ కృష్ణ డియోల్ 8 డిసెంబర్ 1935న జన్మించారు. ఆయన నటుడుగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. ప్రధానంగా హిందీ చిత్రసీమకు లెజెండ్‌గా నిలిచారు. 65 ఏళ్ల కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించి హిందీ చిత్రసీమలో అత్యధిక హిట్ చిత్రాలలో నటించిన రికార్డును సొంతం చేసుకున్నారు.