పాపం బ్రహ్మాజీ.. అందుకే దూరమయ్యాడు..!
Actor Brahmaji reaction on trolls against him on hyderabad floods. విలక్షణ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.
By Medi Samrat Published on 17 July 2023 3:58 PM ISTవిలక్షణ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయనను సోషల్ మీడియాలో కొందరు హర్ట్ చేశారు. సెటైరికల్ గా ఆయన చేసిన పోస్టుపై కొందరు దూషణలకు దిగారు. కొద్దిరోజుల కిందట బ్రహ్మాజీ హైదరాబాద్ లో వర్షాలు కురిసినప్పుడు బోటు కొనుక్కోవడం బెటర్ అని ఓ పోస్టు చేశారు. అయితే ఆయన్ను కొందరు ఇష్టమొచ్చినట్లు తిట్టారు. ఆ ట్వీట్ తర్వాత వచ్చిన విమర్శలపై బాధపడ్డారు బ్రహ్మాజీ.
ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల గురించి ట్వీట్ చేశానని.. కానీ తనను ప్రాంతం పేరుతో విమర్శించారని అన్నారు. ఆరోజు భారీ వర్షం కురిసింది.. నా భార్య నేను కారులో ఉన్నాం. ఇంటికి వెళ్లే దారులన్నీ నీటితో నిండిపోవడంతో దగ్గరలో తెలిసిన వారింట్లో కారు పార్క్ చేసి పక్కనే ఉన్న వంతెన మీదుగా ఇంటికి చేరుకున్నాము. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు మాకు చాలా సహాయం చేశారు. ఇదే విషయాన్ని కాస్త సెటైరికల్ గా.. నేను ఓ బోటు కొనాలనుకుంటున్నానని ట్వీట్ చేసినట్లు తెలిపారు.
దానికి నాపై చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాదు.. ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్స్ చేశారన్నారు బ్రహ్మాజీ. నేను ఎందుకు అలా పోస్ట్ పెట్టాను అనే వివరణ కూడా ఇచ్చానని.. అయినా అలాంటి కామెంట్స్ చేశారని.. తాను చాలా బాధపడ్డానని తెలిపారు. అందుకే కొంతకాలంగా ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్ హీరోగా వస్తున్న స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రమోషన్స్ లో బ్రహ్మాజీ ఈ వ్యాఖ్యలు చేశారు.