అజిత్ అంటేనే సహాయం.. మరోసారి భారీ విరాళం

Actor Ajith Kumar contributes rs.25 lakh to TN CM relief fund. తాజాగా తలా అజిత్ కూడా భారీ సాయాన్ని ప్రకటించారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఫండ్ కు అజిత్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

By Medi Samrat
Published on : 14 May 2021 3:15 PM IST

Actor Ajith Kumar

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో రాష్ట్రాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అయితే ఆ రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చడానికి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ముందుకు వచ్చారు. తాజాగా తలా అజిత్ కూడా భారీ సాయాన్ని ప్రకటించారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఫండ్ కు అజిత్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా అజిత్ డైరెక్టుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపినట్లు అజిత్ ప్రతినిధి తెలిపారు. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర అందుకు సంబంధించిన ప్రకటనను ట్వీట్ చేశారు. ప్రస్తుతం అజిత్ 'వాలిమై' సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమా అప్డేట్ కోసం అజిత్ అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ అధికారం చేపట్టిన తర్వాత పలువురు ప్రముఖులు చీఫ్ మినిస్టర్ ఫండ్ కు విరాళాలు ఇస్తూ ఉన్నారు. హీరో సూర్య, కార్తీ కుటుంబం తరపున కోటి రూపాయల విరాళాన్ని అందించారు. కుటుంబ సమేతంగా సూర్య స్టాలిన్ కు కోటి రూపాయల చెక్ ను అందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తనవంతు సహాయంగా ఒక కోటి రూపాయలను కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం అందజేశారు. సౌందర్య రజనీకాంత్ ఫ్యామిలీ కూడా కోటి రూపాయలను విరాళంగా ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి చెక్ అందించారు. తమిళనాడులో కరోనా కట్టడికి కొత్త ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంది.


Next Story