బ్రేకింగ్: బాలీవుడ్ నటుడు ఆదిత్య మరణం

Actor Aditya Singh Rajput found dead in bathroom due to drug overdose. నటుడు, వ్యాపారవేత్త ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22, సోమవారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు.

By Medi Samrat
Published on : 22 May 2023 7:27 PM IST

బ్రేకింగ్: బాలీవుడ్ నటుడు ఆదిత్య మరణం

నటుడు, వ్యాపారవేత్త ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22, సోమవారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ అంధేరి ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారని ప్రముఖ మీడియా సంస్థలు ధృవీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నటుడు, మోడల్ మరియు కాస్టింగ్ కోఆర్డినేటర్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22 మధ్యాహ్నం అంధేరీలోని తన ఇంటి వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడు. అతని స్నేహితుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ పడిపోయి ఉండడాన్ని గుర్తించాడు. అతను, బిల్డింగ్ వాచ్‌మెన్‌తో కలిసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకోగానే వైద్యులు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ చనిపోయినట్లు ప్రకటించారు. ఇది డ్రగ్ ఓవర్ డోస్ కేసు కావచ్చునని అంటున్నారు. ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మోడల్, నటుడిగా కెరీర్ ను ప్రారంభించాడు. అతను బాలీవుడ్ పరిశ్రమతో బాగా కనెక్ట్ అయ్యాడు. అనేక బ్రాండ్‌లకు పనిచేశాడు. ఆయన మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆదిత్య ఢిల్లీకి చెందినవాడు మరియు మోడల్‌గా కెరీర్ ప్రారంభించాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో అతను నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 300 ప్రకటనలలో భాగమయ్యాడు. స్ప్లిట్స్‌విల్లా 9 వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ 4 ఇతర టీవీ ప్రాజెక్ట్‌లు చేశాడు.


Next Story