ఆచార్య పాట లీక్..?

Acharya Movie Song Leaked. టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆచార్య కూడా ఒకటి.

By Medi Samrat  Published on  25 April 2021 2:08 PM GMT
ఆచార్య పాట లీక్..?

టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆచార్య కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనుసూద్, జిశ్శు సేన్‌గుప్తా, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇంతలో చిత్ర యూనిట్ కు షాకింగ్ కలిగించే ఘటన గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ సినిమాలోని ఓ పాట ట్యూన్, లిరిక్స్ సోషల్‌మీడియాలో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌-పూజా హెగ్డే కూడా నటిస్తూ ఉన్నారు. వీరిద్దరి మధ్య సినిమా ఓ డ్యుయెట్ కూడా ఉంది. 'నీలాంబరి' అంటూ సాగే ఓ పాట లిరిక్స్‌తో పాటు సోషల్‌మీడియాలో లీక్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి 'లాహే.. లాహే' అంటూ సాగే ఓ పాటని చిత్ర యూనిట్ విడుదల చేయగా.. మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఇంకో పాట లీక్ అయ్యిందనే కథనాలు చిత్ర యూనిట్ ను కలవరపెడుతోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story