'రాధేశ్యామ్‌' థియేటర్ వద్ద అపశృతి.. ప్రభాస్‌ అభిమానులకు తీవ్ర గాయాలు

Accident while biting Flexi in "Radheshyam" movie .. Serious injuries to Prabhas fans. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ

By అంజి  Published on  11 March 2022 3:09 AM GMT
రాధేశ్యామ్‌ థియేటర్ వద్ద అపశృతి.. ప్రభాస్‌ అభిమానులకు తీవ్ర గాయాలు

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి పాటలు, ట్రైలర్స్‌ సినిమాపైన భారీ అంచనాలనే క్రియేట్‌ చేశాయి. ఇక 'రాధేశ్యామ్‌' సినిమా థియేటర్లలో అభిమానులు, ప్రేక్షుకులతో సందడి నెలకొంది. థియేటర్ల వద్ద ప్రభాస్‌ అభిమానులు హంగామా చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ప్రభాస్‌ సినిమా థియేటర్లలో వస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పాన్‌ ఇండియా లవ్‌ స్టోరీతో 'రాధేశ్యామ్‌' విడుదలైంది. దీంతో అభిమానులు థియేటర్ల దగ్గర ప్రభాస్‌ భారీ కటౌట్లు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ థియేటర్‌ దగ్గర అభిమాని ప్రభాస్‌ కటౌట్ కడుతుండగా అపశృతి జరిగింది. ఈ ఘటనలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి కారంపూడిలోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ దగ్గర ప్రభాస్‌ 30 అడుగుల బ్యానర్‌ కడుతుండగా ప్రమాదం జరిగింది. 37 ఏళ్ల చల్లా కోటేశ్వరరావు ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌. సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా , అది కాస్తా కరెంట్‌ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో ఇద్దరికి కూడా గాయాలు కాగా.. వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it