అభినయ కాబోయే భర్త ఎవరో తెలుసా.?

నటి అభినయ.. మాటలు రాకపోయినా తనకంటూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

By Medi Samrat
Published on : 29 March 2025 3:45 PM IST

అభినయ కాబోయే భర్త ఎవరో తెలుసా.?

నటి అభినయ.. మాటలు రాకపోయినా తనకంటూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు సినిమాలలో నటించి ఆకట్టుకుంది. తాజాగా ఆమె తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది.

మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె ఫోటోలు షేర్‌ చేసింది. అతని పేరు సన్నీ వర్మ అని తెలిపింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు మీడియా నివేదికలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్‌ చేసింది. నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉన్నాను. 15 ఏళ్లుగా మా మధ్య బంధం ఉందని తెలిపింది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని, నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో పంచుకోగలనని తెలిపింది.

Next Story