హీరోలను కాపాడిన రెస్క్యూ టీమ్

మిచౌంగ్ తీవ్ర తుపాను కారణంగా చెన్నైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.

By Medi Samrat  Published on  5 Dec 2023 7:30 PM IST
హీరోలను కాపాడిన రెస్క్యూ టీమ్

మిచౌంగ్ తీవ్ర తుపాను కారణంగా చెన్నైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సెలెబ్రిటీలు సైతం తాము ఉన్న ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తమిళ యువ హీరో విష్ణువిశాల్ ఇంటి పైకి ఎక్కి సాయం కోసం అర్థించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా వరదల్లో చిక్కుకుపోయారు. విష్ణువిశాల్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన అధికారులు కరప్పాక్కం ఏరియాకు రెస్క్యూ టీమ్ ను పంపారు. ఈ రెస్క్యూ బృందం ఆమిర్ ఖాన్ తో పాటు హీరో విష్ణువిశాల్, గుత్తా జ్వాల దంపతులను కూడా రబ్బరు బోట్ల సాయంతో కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలను విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అగ్నిమాపక దళ సిబ్బందికి, రెస్క్యూ బృందాలకు విష్ణువిశాల్ కృతజ్ఞతలు తెలిపాడు.

తాను కరపాక్కంలో చిక్కుకుపోయానని ఇంతకు ముందు విష్ణువిశాల్ వెల్లడించాడు. "నా ఇంట్లోకి నీరు చేరుతోంది. కరపాక్కంలో నీటి మట్టం బాగా పెరుగుతోంది. నేను సహాయం కోసం కాల్ చేసాను. కరెంటు లేదు, వైఫై లేదు. ఫోన్ సిగ్నల్ లేదు. టెర్రస్ మీద మాత్రమే ఉండగలుతున్నాం." అని పోస్టు పెట్టాడు.

Next Story