అనుకున్నదే నిజమైంది.. లోకేష్‌తో ఆమిర్

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

By Medi Samrat
Published on : 5 Jun 2025 3:25 PM IST

అనుకున్నదే నిజమైంది.. లోకేష్‌తో ఆమిర్

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' ఈ నెల 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.

లోకేశ్‌ కనగరాజ్‌తో చేయబోయే సినిమా గురించి పలు హింట్స్ కూడా ఇచ్చారు ఆమిర్. అది సూపర్ హీరో జానర్‌కు చెందిన కథ అని. భారీ స్థాయిలో తెరకెక్కే యాక్షన్ సినిమా ఇదని అన్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆమిర్‌ చెప్పారు. తమిళంలో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్న లోకేశ్‌ కనకరాజ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో తన సత్తా చూపించబోతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేయనున్నట్లు అమీర్ ఖాన్ ధృవీకరించారు.

Next Story