11 ఏళ్ల తర్వాత మళ్లీ కలయిక.. ఏం జ‌రుగుతుందంటే..?

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన రాబోయే చిత్రం సితారే జమీన్ పర్ ప్ర‌స్తుతం వార్తల్లో ఉంది.

By Medi Samrat
Published on : 14 May 2025 9:40 AM

11 ఏళ్ల తర్వాత మళ్లీ కలయిక.. ఏం జ‌రుగుతుందంటే..?

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన రాబోయే చిత్రం సితారే జమీన్ పర్ ప్ర‌స్తుతం వార్తల్లో ఉంది. తాజాగా నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 3 త్రీ ఇడియట్స్, PK వంటి మెగా బ్లాక్‌బస్టర్‌లను అందించిన ప్రముఖ చిత్రనిర్మాత, ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరానీతో అమీర్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కాస్త వివరంగా తెలుసుకుందాం.

అమీర్, రాజ్‌కుమార్ హిరానీ 2014లో PK చిత్రంలో కలిసి పనిచేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ జంట మూడోసారి కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. రాజ్‌కుమార్ హిరానీ మూడు కథలపై పనిచేస్తున్నారు. అందులో ఒకదాని గురించి అమీర్‌తో చర్చించాడు. అమీర్‌కి కథ నచ్చడంతో హిరానీని ఇంకా వర్క్ చేయమని కోరాడు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ సామాన్యుడి జీవితానికి సంబంధించిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. అయితే ఈ విషయం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, అమీర్ ఖాన్‌తో సినిమా చేస్తే.. అది ఖచ్చితంగా వినోద ప్రపంచంలోని అభిమానులకు పెద్ద ట్రీట్ అవుతుంది. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చివరి చిత్రం షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ, ఇది వాణిజ్యపరంగా మంచి వసూళ్లను సాధించింది.

మే 13 సాయంత్రం అమీర్ ఖాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలైంది. దీనిని అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ సినిమాలో అమీర్ బాస్కెట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తాడు. లాల్ సింగ్ చద్దా విడుదలైన 3 సంవత్సరాల తర్వాత.. వ‌స్తున్న ఈ సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Next Story