'ఆదిపురుష్‌' నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ .. మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Aadi purush release date .. రెబల్‌స్టార్ ప్రభాస్‌ అభిమానులకు 'ఆదిపురుష్‌' చిత్ర బృందం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

By సుభాష్  Published on  19 Nov 2020 3:13 AM GMT
ఆదిపురుష్‌ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ .. మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

రెబల్‌స్టార్ ప్రభాస్‌ అభిమానులకు 'ఆదిపురుష్‌' చిత్ర బృందం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాను 2022 ఆగస్టు 11 తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఈ పోస్టును విడుదల చేశారు. ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తుండగా, సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పౌరాణిక చిత్రానికి హాలీవుడ్‌ విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్స్‌ పని చేయనున్నారని తెలుస్తోంది. రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు.

ఇతర పాత్రల కోసం ఇతరులను సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందులో సీత పాత్రకు గానూ ఇప్పటికే అనుష్క, అనుష్క శర్మ, కీర్తి సురేష్‌, కియారా, కృతి సనన్‌ ఇలా పలువురి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, ఈ మూవీ కోసం ప్రభాస్‌ విలువిద్యను సైతం నేర్చుకుంటున్నారు. 3డీలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నట్లు సమాచారం. తెలుగు, హిందీలో ఒకేసారి విడుదలయ్యే ఈ సినిమా.. భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.

Next Story
Share it