గొడవ పడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి

Aadhi Pinisetty About His Love Story. కొద్దిరోజుల కిందట ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  16 July 2022 5:30 PM IST
గొడవ పడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి

కొద్దిరోజుల కిందట ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. సంప్రదాయబద్ధంగా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇద్దరూ మలుపు, మరకతమణి వంటి ప్రాజెక్ట్‌లలో కలిసి నటించారు. ఇద్దరి కుటుంబాలకు సంబంధించి ఏ ఫంక్షన్స్ జరిగినా కలిసి కనిపించే వారు. తాజాగా రామ్ పోతినేని హీరోగా నటించిన 'ది వారియర్‌' సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించాడు. సినిమాకు ప్లస్ గా మారాడు ఆది పినిశెట్టి.

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా తమ లవ్ స్టోరీ గురించి ఆది పినిశెట్టి చెప్పుకొచ్చాడు. నిక్కీ మలుపు చిత్రం నుంచే మంచి ఫ్రెండ్. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో తనకు నాకు గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొన్ని రోజులు మేం మాట్లాడుకోలేదు. సెట్‌లో మేం అసలు మాట్లాడుకునే వాళ్లం కాదు. దాదాపు షూటింగ్‌ అంతా అలానే పూర్తి చేశాం. ఇక చివరిలో మళ్లీ కలిశామని తెలిపాడు. అలాగే మలుపు అనంతరం ఇద్దరం కలిసి పలు సినిమాలు చేశాం. ఈ ప్రయాణంలో మా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీనే నాకు ప్రపోజ్‌ చేసింది. తను నా దగ్గరకి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ వెంటనే నేను కూడా ఓకే చెప్పానని ఆది చెప్పుకొచ్చాడు.










Next Story