హీరో రాజ్ తరుణ్‌పై యువతి ఫిర్యాదు.. ప్రేమించి మోసం చేశాడంటూ..
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 5 July 2024 1:35 PM ISTహీరో రాజ్ తరుణ్‌పై యువతి ఫిర్యాదు.. ప్రేమించి మోసం చేశాడంటూ..
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు. 11 ఏళ్లుగా తామిద్దరం ప్రేమలో ఉన్నామని, శారీరకంగానూ ఒక్కటయ్యామని, ఒకే ఇంట్లో ఉండేవాళ్లమని తెలిపారు. రాజ్ తరుణ్ తన కొత్త సినిమాలో హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించారు. అతడిని ప్రశ్నించినందుకు తనను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ప్రేయసి లావణ్య నార్సింగి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
తనను మోసం చేసిన అమ్మాయిల పిచ్చి ఉన్న రాజ్ తరుణ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రేయసి లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ తనను వదిలేసి వెళ్లడానికి ఓ సినీ నటి కారణమని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆ సినీ నటితో పాటూ ఆమె సోదరుడిపై కూడా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని తనను వాళ్లు బెదిరిస్తున్నారని పోలీసులకు వెల్లడించింది.
''11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు. రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని సదరు నటి ఆమె సోదరుడు బెదిరిస్తున్నారు'' అంటూ యువతి సంచలన ఆరోపణలు చేసింది. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని, ఆ సమయంలో రాజ్ తనకెలాంటి సాయం చేయలేదని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తాజాగా ఈ ఘటన ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.