పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఓజీ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలతో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అభిమానుల ముందుకు మరోసారి రానున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి పాట గురించి అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ సినిమా మొదటి సాంగ్ డిసెంబర్‌లో విడుదల అవుతుందని ధృవీకరించారు.
అల్లరి నరేష్ '12A రైల్వే కాలనీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హరిష్ శంకర్ ముఖ్య అతిథిగా వచ్చారు. తన ప్రసంగంలో, ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి సింగిల్ డిసెంబర్‌లో విడుదల అవుతుందని ప్రకటించారు. సాంగ్ విడుదలకు ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించబడలేదు. థియేటర్లలో సినిమా విడుదల విషయానికొస్తే, ఈ చిత్రం 2026 వేసవికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.