విగతజీవిగా కనిపించిన నటి అయేషా ఖాన్

పాకిస్తానీ ప్రముఖ నటి ఆయేషా ఖాన్ విగతజీవిగా కనిపించింది.

By Medi Samrat
Published on : 21 Jun 2025 9:30 PM IST

విగతజీవిగా కనిపించిన నటి అయేషా ఖాన్

పాకిస్తానీ ప్రముఖ నటి ఆయేషా ఖాన్ విగతజీవిగా కనిపించింది. మరణించిన దాదాపు వారం తర్వాత సమాచారం బయటకు వచ్చింది. ఆమె అపార్ట్‌మెంట్‌లో మృతి చెంది కనిపించారు. 76 ఏళ్ల అయేషా ఖాన్ కరాచీ లోని గుల్షన్-ఎ-ఇక్బాల్ బ్లాక్ 7లోని ఆమె నివాసంలో చనిపోయి కనిపించారు. అప్పటికే ఆమె మృతదేహం కుళ్లిపోయి ఉంది.

ఆమె ఫ్లాట్ నుండి తీవ్రమైన, దుర్వాసన వస్తున్నట్లు పొరుగువారు గుర్తించిన తర్వాత ఈ దారుణమైన విషయం బయటపడింది. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, మరణానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం జిన్నా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల తర్వాత, ఆమె మృతదేహాన్ని తదుపరి లాంఛనాల కోసం మార్చురీకి తరలించారు. ఆమె చాలా సంవత్సరాలుగా ఒంటరిగా నివసిస్తున్నారని, బయటి ప్రపంచంతో పరిమిత సంబంధాలు కలిగి ఉన్నారని పలువురు తెలిపారు.

Next Story