జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. బాల‌య్య సినిమాకు ఉత్త‌మ తెలుగు చిత్రం అవార్డ్‌..!

కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. '12th ఫెయిల్' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

By Medi Samrat
Published on : 1 Aug 2025 7:03 PM IST

జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. బాల‌య్య సినిమాకు ఉత్త‌మ తెలుగు చిత్రం అవార్డ్‌..!

కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. '12th ఫెయిల్' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. జాతీయ ఉత్తమనటుడు అవార్డును షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాసే (12th ఫెయిల్) పంచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) నిలిచారు. నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ కన్నడ చిత్రంగా 'కండీలు', జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా 'పార్కింగ్' ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ హిందీ చిత్రం 'కథల్' ఎంపికైంది. జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ సినిమా కేటగిరీలో 'హనుమాన్' అవార్డుకు ఎంపికైంది.

బలగం సినిమాలోని 'ఉరు-పల్లెటూరు' పాటకు జాతీయ పురస్కారం దక్కింది. జాతీయ ఉత్తమ సినీ గీతంగా నిలిచింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ (వాత్తి) ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్ ఎంపికయ్యారు. 'బేబీ' చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు.

Next Story