కాంతారా మూవీ.. క్లైమాక్స్ సమయంలో ఛాతీ నొప్పి

45-Year-Old Man Dies of Heart Attack While Watching Kantara. రిషబ్ శెట్టి కన్నడ చిత్రం 'కాంతారా' మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఓ వైపు కలెక్షన్స్..

By Medi Samrat
Published on : 25 Oct 2022 7:45 PM IST

కాంతారా మూవీ.. క్లైమాక్స్ సమయంలో ఛాతీ నొప్పి

రిషబ్ శెట్టి కన్నడ చిత్రం 'కాంతారా' మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఓ వైపు కలెక్షన్స్.. మరో వైపు వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ సినిమాకు సంబంధించి ఒక విషాద వార్త బయటకు వచ్చింది. థియేటర్లలో సినిమా చూస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు కథనాలు వచ్చాయి. మరణించిన వ్యక్తి పేరు రాజశేఖర్ అని తెలుస్తోంది. అక్టోబర్ 24, సోమవారం నాగమంగళలోని వెంకటేశ్వర థియేటర్‌లో కాంతారా సినిమా చూశాడు. అతను తన స్నేహితులతో మార్నింగ్ షోకి వెళ్ళాడు, అయితే సినిమా క్లైమాక్స్ సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. థియేటర్ నుంచి బయటకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో థియేటర్ సమీపంలోనే కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచాడని తెలుస్తోంది.

అతడి స్నేహితులు మాట్లాడుతూ 'నాగమంగళ తాలూకాలోని సరిమేగలకొప్ప నివాసి.. వెంకటేష్ కాంతార సినిమా చూసేందుకు సినిమాకి వచ్చాడు. కాంతార సినిమా చూస్తుండగా రాజశేఖర్‌కు ఛాతీ నొప్పి వచ్చింది. అక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని హాస్పిటల్ కు తరలించగా రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు.' అని వెల్లడించారు. కాంతారా సినిమా క్లైమాక్స్ ఒక అద్భుతమని.. ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. రిషబ్ శెట్టి.. ఆఖరి 20 నిమిషాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.


Next Story