38 ఏళ్లు.. 520 సినిమాలు.. ఈ ప్రయాణం అంత సులభం కాదు

38 years of Anupam Kher in Bollywood. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ బాలీవుడ్‌లో 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు,

By Medi Samrat  Published on  25 May 2022 7:48 PM IST
38 ఏళ్లు.. 520 సినిమాలు.. ఈ ప్రయాణం అంత సులభం కాదు

లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ బాలీవుడ్‌లో 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, ఈ ప్రయాణం గురించి అభిమానుల‌తో కూ వేదిక‌గా ఒక వీడియోను పంచుకున్నాడు. బాలీవుడ్ లెజెండరీ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్.. తన నటనా నైపుణ్యంతో ఎంతో పేరుగాంచారు. ఎంత బిజీగా ఉన్న‌ అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో.. ఆయ‌న‌ తరచుగా తన అభిమానుల కోసం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు. అనుపమ్ ఖేర్ సాధారణ వ్యక్తులతో సంభాషించే చిత్రాలు, వీడియోలు చాలా పోస్ట్ చేస్తారు. దీంతో ఆయ‌న‌ అభిమానులు కూడా ఆయ‌న పోస్టుల కోసం ఎదురుచూస్తు ఉంటారు.

ఈసారి అనుపమ్ ఖేర్ తన 38 సంవత్సరాల బాలీవుడ్ ప్రయాణానికి సంబంధించి ఓ వీడియోను పంచుకున్నారు. అందులో ఆయ‌న తన కెరీర్‌లో మంచి, చెడు సంద‌ర్భాల‌ గురించి చెప్పారు. దీనితో పాటు.. ధరమ్‌వీర్ మల్హోత్రా.. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే నుండి.. ఇటీవల ది కాశ్మీర్ ఫైల్స్‌లో నటించిన పుష్కర్ నాథ్ పండిట్ కీలక పాత్ర వరకు ఆ చిత్రాలన్నింటిలో తాను పోషించిన పాత్రలను కూడా ఆయ‌న‌ తన వీడియోలో ప్ర‌స్తావించారు.

ఈ ప్రయాణం అంత సులభం కాదని.. సమయం ఉంటే అది గడిచిపోతుందని చెప్పారు. అనుపమ్ తన ప్రయాణాన్ని ప్రారంభించిన తేదీని వివ‌రిస్తూ.. మే 25 అని చెప్పారు. ఈ రోజుతో తాను బాలీవుడ్‌కు 38 సంవత్సరాల చిరస్మరణీయ ప్రయాణాన్ని అందించానని అన్నారు.

ఈ ప్రయాణం కూడా తనకు చాలా ప్రత్యేకమైనదని, తాను బాలీవుడ్‌లో దాదాపు 520 సినిమాలు చేశానని, ఈ ప్రయాణంలో ఉన్న అన్ని సినిమాలు తనకు చాలా దగ్గరగా ఉన్నాయని కూడా ఆయ‌న‌ తన వీడియోలో వివ‌రించారు. ఈ ప్రయాణం నా ఒక్కడిదే కాదు. ఈ ప్రయాణంలో నా కుటుంబం, స్నేహితులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు చాలా కాలం పాటు నాతో పనిచేశారు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు అంద‌రికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.



















Next Story