అందుకే డార్లింగ్ అయ్యాడు.. రాధేశ్యామ్ యూనిట్ కు ప్రభాస్ గిఫ్ట్

Prabhas Gift to Radhe Shyam Unit. ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jan 2021 9:30 AM GMT
అందుకే డార్లింగ్ అయ్యాడు.. రాధేశ్యామ్ యూనిట్ కు ప్రభాస్ గిఫ్ట్

ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి వరుసగా దర్శకులు క్యూ కడుతూ ఉన్నారు. అది కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఇక ప్రభాస్ సినిమా సెట్స్ లో ఉంటే ఎంతో సందడి సందడిగా ఉంటుంది. తన కో స్టార్స్ ను కూడా ఎంతో బాగా చూసుకుంటాడని చాలా సార్లు రుజువు అయ్యింది. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఆ చిత్ర యూనిట్ సభ్యులకు మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు.

సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా ముగించాలని తీవ్రంగా కృషి​ చేస్తోంది చిత్ర యూనిట్‌. వారి కష్టాన్ని మెచ్చి‌ ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట. ఈ వాచ్‌లకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రాధేశ్యామ్‌ సినిమా పూర్తయ్యాక ఆదిపురుష్‌, నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా, కేజీఎఫ్‌ దర్శకుడితో సలార్‌ సినిమాలను పూర్తీ చేయనున్నాడు ప్రభాస్.

Next Story
Share it