మీరు ప‌ది పాస్ అయ్యారా.. అయితే డీఆర్‌డీఓలో ఉద్యోగం రెడీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Dec 2019 10:57 AM GMT
మీరు ప‌ది పాస్ అయ్యారా.. అయితే డీఆర్‌డీఓలో ఉద్యోగం రెడీ..!

10వ‌ తరగతి పాసైనవారికి శుభ‌వార్త‌. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(డీఆర్‌డీఓ) కేంద్ర ప్ర‌భుత్వ‌ సంస్థ 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌గా 1,817 పోస్టులను భర్తీ చేయ‌డానికి రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒకేసారి 1,817 10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. అయితే.. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ద్వారా పోస్టుల భర్తీ జరగనుంది.

ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. అయితే దరఖాస్తులకు చివరి గ‌డువు తేదీగా జనవరి 23గా వెల్ల‌డించారు. అర్హతల వివరాలు... పదవ తరగతి, ఐటీఐ పాసైనవాళ్లు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 100.

ఇదిలావుంటే.. డీఆర్‌డీఓకు హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు ఆగ్రా, మైసూర్, గ్వాలియర్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, జైపూర్ వంటి న‌గ‌రాల్లో కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో డీఆర్‌డీఓ మల్టీటాస్కింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను drdo.gov.in వెబ్‌సైట్‌లో పొంద‌వ‌చ్చు.

Next Story