క‌రెంట్ బిల్లు రాలేద‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారా.? ఇలా చేయండి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 April 2020 7:40 PM IST
క‌రెంట్ బిల్లు రాలేద‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారా.? ఇలా చేయండి..

క‌రోనా వైర‌స్ సృష్టిస్తున్న అరాచ‌కానికి అడుగు తీసి అడుగు వేయ‌లేని దుస్థితి. ప్ర‌పంచ‌మంతా లాక్‌డౌన్‌ల‌తో ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యార‌య్యింది. ఇక మ‌న దేశంలోనూ అదే ప‌రిస్థితి ఉండ‌గా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్ క‌ట్టుదిట్టంగా అమ‌ల‌వుతుంది. ఒక‌టి రెండు విభాగాలు(అత్య‌వ‌స‌ర‌) మిన‌హా.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌నుండి ప్ర‌వేట్ సంస్థ‌ల ఉద్యోగుల వ‌ర‌కూ ఇంటిప‌ట్టునే ఉండిపోతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల‌లో ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఓ నిర్ణ‌యం తీసుకుంది.

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటింటికి బిల్ కలెక్టర్లు రాలేని పరిస్థితి. ఈ నేఫ‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2019 సంవ‌త్స‌రం మార్చిలో మీరు చెల్లించిన‌ కరెంట్ బిల్లునే ఈ నెలలో ఆన్‌లైన్ ద్వారా కట్టుకోవచ్చని వినియోగదారులకు తెలిపింది. అలాగే.. పెద్ద పెద్ద సంస్థ‌లు, పరిశ్రమల విషయానికి వస్తే గత ఏడాది మార్చిలో వచ్చిన బిల్లులో సగం క‌డితే చాల‌ని సూచించింది.

దీనికి సంబంధించి 2019 మార్చి బిల్లుల వివరాలు నేరుగా వినియోగ‌దారుల‌ ఫోన్‌కు మెసేజ్‌గా రానున్నాయి. లాక్‌డౌన్ కార‌ణంగా మీట‌ర్ రీడింగ్ తీసుకోవ‌డం ఇబ్బందిగా ఉండ‌టంతో.. డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ అనంత‌రం మీటర్ రీడింగ్ తీసుకొని బిల్లు ఇస్తారు. ఒకవేళ ఎక్కువ బిల్లు చెల్లిస్తే సర్దుబాటు చేస్తారు. తక్కువ బిల్లు చెల్లిస్తే వచ్చే నెలలో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. సో.. ఎవ‌రైతే ఫైన్ ప‌డుతుంది.. క‌రెంట్ బిల్లు రాలేదు అని టెన్ష‌న్ ప‌డటం మాని ఇలా చేయండి.

[video width="240" height="144" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-14-at-6.53.42-PM.mp4"][/video]

Next Story