తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా
By సుభాష్ Published on 23 Dec 2019 7:15 PM ISTతెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నరాగా మోగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈమేరకు ఇందుకు సంబంధించిన షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అలాగే 12,13 తేదీల్లో తిరస్కరించిన నామినేషన్లను అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక జనవరి 22న పోలింగ్, 25న ఫలితాలు వెల్లడించనున్నారు. బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలుండగా, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, పురపాలక సంఘాలకు పదవీ కాలం ముగిసినప్పటికీ వార్డుల విభజన, న్యాయపరమైన వివాదాల వల్ల ఎన్నికలు ఆలస్యం అయిపోయాయి. దీంతో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లీయర్ అయింది.